: మూడు పశ్చిమగోదావరికి... నాలుగు ‘తూర్పు’కు
పోలవరం ఆర్డినెన్స్ ను లోక్ సభ ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలపనున్నారు. మొత్తం ఏడు ముంపు మండలాల్లో నాలుగు తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతుండగా, మూడు పశ్చిమగోదావరి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. బూర్గంపాడు (పాక్షికంగా), కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో కలపనున్నారు. భద్రాచలం టౌన్ మినహా మిగిలిన భద్రాచలం మండలంతో పాటు చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్‌లో కలుపుతారు.