: నా భార్యపట్ల మున్సిపల్ ఛైర్మన్ అనైతికంగా ప్రవర్తించాడు: హోటల్ యజమాని ఆవేదన
తన భార్య పట్ల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ ఛైర్మన్ అనైతికంగా ప్రవర్తించారని స్థానిక శరవణభవన్ హోటల్ యజమాని మనోహరన్ ఆరోపించారు. శ్రీకాళహస్తిలో ఆయన మాట్లాడుతూ, తమ హోటల్ పై మున్సిపల్ ఛైర్మన్ పేట రాధారెడ్డి కన్నేశాడని అన్నారు. హోటల్ ఎలాగైనా ఖాళీ చేయించాలని ఆయన కంకణం కట్టుకున్నాడని మనోహరన్ తెలిపారు. అందులో భాగంగా తమను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని, తక్షణం ఖాళీ చేయాలని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. స్థలానికి సంబంధించి తమకు 30 ఏళ్ల లీజు ఒప్పందం ఉందని మనోహరన్ వెల్లడించారు. మహిళ అని కూడా చూడకుండా తన భార్యపట్ల రాధారెడ్డి అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆయన మీడియా ముందు వాపోయారు.