: మట్టిదిబ్బ ఐదుగురి ప్రాణాలు తీసింది
నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం వజినేపల్లిలోని పులిచింతల ప్రాజెక్టు పవర్ హౌస్ వద్ద మట్టిదిబ్బ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గోవింద్, గోపాల్ రెడ్డి, సలీం, సుబ్బు, నందుగా గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.