: తిరుమలలో ఆరంభమైన వైఖానస ఆగమ సదస్సు
తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ సదస్సు ప్రారంభమైంది. వివిధ జిల్లాల నుంచి 200 మంది ఆగమ శాస్త్ర పండితులు హాజరైన ఈ సదస్సుకు టీటీడీ ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తిరుమలేశుని ఆలయంలో వైఖానస ఆగమప్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, ఆర్జిత సేవలు తదితరాల విశిష్టతను తెలియజేస్తారు.