: ఏపీలో కలవనున్న 211 గ్రామాలు


పోలవరం ఆర్డినెన్స్‌ ను లోకసభ శుక్రవారం ఆమోదించడంతో... ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవనున్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీలో కలుస్తాయి. కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు, కుకునూరు, చింతూరు మండలాలు పూర్తిగా ఏపీలో కలవగా... భద్రాచలం, బూర్గంపాడు మండలాలు పాక్షికంగా ఏపీలో కలుస్తాయి. ఏడు మండలాలలోని దాదాపు 211 గ్రామాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలోకి వస్తాయి. ఏపీలో కలిపిన ప్రాంతంలో దాదాపు 34వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. లక్షా 20 వేల మంది ప్రజలు ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు. పోలవరం ఆర్డినెన్స్ ద్వారా దాదాపు 3,267 హెక్టార్ల భూమి ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతంలో కలిసింది.

  • Loading...

More Telugu News