: నా కుమార్తెను వేధిస్తున్నాడు: ప్రముఖ దర్శకుడు
ఓ యువకుడు తన కుమార్తెను ఎస్ఎంఎస్ లతో వేధిస్తున్నాడని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఫ్లోరిడా నుంచి వచ్చిన ఆ యువకుడు తన కుమార్తెకు ఎస్ఎంఎస్ లతో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రణీత్ అని కడపజిల్లాకు చెందిన వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. తనకు డైరెక్టర్ కుమార్తెతో ఇటీవలే పరిచయమైందని, ఈ నేపథ్యంలోనే ఎస్ఎంఎస్ లను పంపుతున్నానని ప్రణీత్ తెలిపాడు. ఇకపై ఇలా చేయనని పోలీసులు, సదరు డైరెక్టర్ సమక్షంలో తప్పు అంగీకరించడంతో, ఆ యువకుడిపై పెట్టిన కేసు వాపస్ తీసుకున్నట్టు తెలిపారు. అయితే, ఆ ప్రముఖ డైరక్టర్ ఎవరన్న వివరాలు వెల్లడికాలేదు.