: జగన్ నోట ప్రజాస్వామ్యమా?... ఎంత హాస్యం: కాల్వ శ్రీనివాసులు


వైఎస్సార్సీపీ నేత జగన్, అతని అనుచరులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'ప్రజాస్వామ్యం అంటూ ఢిల్లీలో గొంతు చించుకుంటున్న జగన్, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు సాగించాడు. అది కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనా?' అని ప్రశ్నించారు. అందుకు చాలా నిదర్శనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ ప్రభుత్వంపై అభాండాలు వేయడం మానేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News