: కేంద్ర కేబినెట్ ఖర్చు రూ. 434 కోట్లు
కేంద్ర కేబినెట్ ఖర్చులకు జైట్లీ రూ. 433.52 కోట్లు కేటాయించారు. విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు అతిథ్యం ఖర్చుతో పాటు... ప్రధాన మంత్రి, ఇతర మంత్రుల కార్యాలయాల నిర్వహణను దృష్టిలో పెట్టుకుని ఇంత భారీ మొత్తాన్ని కేటాయించారు. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 16 శాతం ఎక్కువ. యూపీఏ హయాంలోని గత బడ్జెట్ లో కేంద్ర కేబినెట్ కోసం రూ. 375 కోట్లు విడుదల చేశారు. కేంద్ర కేబినెట్ మంత్రుల జీతాల కోసం రూ. 5.80 కోట్లు, సహాయ మంత్రుల జీతాల కోసం రూ. 5.50 కోట్లను కేటాయించారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల పర్యటనలకు రూ. 271.80 కోట్లను కేటాయించారు. జాతీయ భద్రతా మండలికి సంబంధించిన ఖర్చుల కోసం రూ. 46 కోట్లు కేటాయించారు. మోడీ హయాంలో అత్యంత కీలకంగా మారిన పీఎంవో సిబ్బంది జీతాలు, కార్యాలయ నిర్వహణ కోసం రూ. 38.44 కోట్లు కేటాయించారు