: హైదరాబాద్ సీమాంధ్ర విద్యార్థులకు షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ రెఢీ!


1956 కంటే ముందు తెలంగాణలో నివసించిన వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తుందని వస్తున్న వార్తలను తెలంగాణ ఫ్రభుత్వం నిజం చేసేటట్టు కనపడుతోంది. ఈ మేరకు ఓ జీవోను తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను సడలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణలోని మేధావి వర్గం కూడా సూచించినప్పటికీ కేసీఆర్ ఈ విషయంలో వెనకడుగు వేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం వల్ల గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న, చదువుకుంటున్న ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేస్తే... దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉత్తర్వులను అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. 1956 కంటే ముందు తెలంగాణలో నివసించిన వారికే స్థానికత వర్తిస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న నిర్వచనం ఏ విధంగానూ చెల్లదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఉన్న విద్యార్థులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు నాన్ లోకల్ అభ్యర్థులుగా ఉన్నారు. వారిని తెలంగాణ ప్రభుత్వం సైతం నాన్‌లోకల్‌గా గుర్తిస్తే వారి పరిస్థితి ఏమిటన్నది మంత్రిమండలి సమావేశంలో తీవ్రంగా చర్చించారు. రీయింబర్స్‌మెంట్ నిబంధనలు చదువుతో పరిమితం కాబోవని, రానున్న రోజుల్లో ఉద్యోగాల నియామకాల్లో కూడా వర్తింపచేస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మేధావులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News