: పోలవరం బిల్లుపై లోక్ సభలో ఎంపీ గుత్తా నిరసన
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై తీవ్ర గందరగోళం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన ప్రాంత ప్రజలకు అన్యాయం చేసే విధంగా పోలవరం బిల్లు ఉందన్నారు. దానిని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా ఆమోదించాలనుకోవడం సరికాదన్నారు. వెంటనే పోలవరం డిజైన్ మార్చాలని, బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.