: మోడీ బడ్జెట్ కు యూఎస్ పెట్టుబడిదారుల స్వాగతం
నరేంద్రమోడీ ప్రభుత్వ తొలి ఆర్థిక బడ్జెట్ కు అమెరికా నిపుణులు, కార్పొరేట్ రంగం ఆహ్వానం పలికింది. సరైన మార్గంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, త్వరిత వృద్ధికి బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది. వచ్చే మరికొన్నేళ్లలో భారతదేశ అభివృద్ధి ప్రణాళికలలో అమెరికా విస్తృత స్థాయి ప్రమేయం ఉండేలా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తలుపులు తెరిచారని చెప్పారు. మోడీ ప్రభుత్వానిది సమతుల్యమైన, అంచనా ఉన్న, తెలివైన బడ్జెట్ అని ప్రశంసించారు. దాంతో, పలువురు అమెరికా ఇన్వెస్టర్లు దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉండాలని ఆలోచిస్తున్నట్లు ప్రముఖ పరిశీలకుడు రాన్ సోమర్స్ చెబుతున్నారు. అటు బీమారంగం, రక్షణ రంగంలో భారీగా ఎఫ్ డీఐలను పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం కూడా మంచిదంటున్నారు.