: పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ కు ప్రధాని ఇంటిదారి చూపారు!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీని పదవి నుంచి తొలగిస్తూ ప్రధాని నవాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. పాట్రన్-ఇన్-చీఫ్ హోదాలో షరీఫ్ తన నిర్ణయం ప్రకటించారు. అంతేగాకుండా, మేనేజ్ మెంట్ కమిటీని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఈ స్థానంలో ఓ అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేసి 30 రోజుల్లోగా బోర్డుకు ఎన్నికలు జరపాలని ఆదేశించారు. కాగా, మాజీ చైర్మన్ జకా అష్రాఫ్ కు మునుపటి వలే పీసీబీ టాప్ చెయిర్ అప్పగించాలని ఇస్లామాబాద్ హైకోర్టు పేర్కొంది. దీనిపై పీసీబీ, పాక్ క్రీడా వ్యవహారాలు పర్యవేక్షించే ఇంటర్ ప్రొవిన్షియల్ కోఆర్డినేషన్ మంత్రిత్వ శాఖ సుప్రీంలో సవాలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నవాజ్ షరీఫ్ తాజా నిర్ణయాలు తీసుకున్నారు.