: పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం: ఎంపీ వినోద్
పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. విభజన జరిగి, రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆర్డినెన్సును తీసుకురావాలనుకోవడం దారుణమని అన్నారు. లోక్ సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల హద్దులను మార్చేముందు రాష్ట్ర అసెంబ్లీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. శాసనసభ అభిప్రాయం తీసుకోకుండా పార్లమెంటులో చర్చించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు.