: చిరు వ్యాపారులైతేనేం.. పెద్ద మనసు ప్రదర్శించారు


రైల్వే స్టేషన్ లో దొరికిన ఆభరణాలను భద్రంగా అధికారులకు అప్పగించిన ఇద్దరు చిరు వ్యాపారులు తమ పెద్ద మనసు చాటుకున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని సోనార్పూర్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. స్టేషన్ కు వచ్చిన ఓ రైలు నుంచి ప్రయాణికులందరూ దిగిపోయారు. ఆ తర్వాత ఆ పెట్టెలో ప్రవేశించిన రూప్ చంద్, టుల్లు అనే చిరు వ్యాపారులకు బెర్త్ పై ఓ సంచి కనిపించింది. దాంట్లో బంగారు, వెండి నగలున్నాయి. అయితే, వారిద్దరూ ఎలాంటి ప్రలోభానికి గురికాకుండా ఆ సంచిని అధికారులకు అప్పగించి తమ నిజాయతీ ప్రదర్శించారు. అధికారులు నగల సొంతదారులను గుర్తించి వాటిని అప్పగించారు. అనంతరం ఆ చిరు వ్యాపారులను ప్రశంసించారు.

  • Loading...

More Telugu News