: న్యాయమూర్తులకు వందలకొద్దీ లేఖలు రాసిన సోనియా తోడికోడలు


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తోడికోడలు, మోడీ కేబినెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకగాంధీ దేశంలోని హైకోర్టుల న్యాయూర్తులకు, జిల్లా జడ్జిలకు ఎన్ని లేఖలు రాశారో తెలుసా..? అక్షరాలా 700 లేఖలు రాశారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న దత్తత కేసులను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఆమె ఇన్ని లేఖలు రాశారు. చిన్నారులను దత్తత తీసుకున్న కుటుంబాలు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటుండడంతో, ఆ చిన్నారుల బదలాయింపుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ఆ పసివాళ్ళు బాలల గృహాల్లోనే మగ్గిపోతున్నారని మేనకాగాంధీ ఆ లేఖల్లో వివరించారు. ఇలాంటి కేసులను వెంటనే పరిష్కరిస్తే ఆ చిన్నారులకు ఊరట లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News