: ఎన్నికలంటే 'అందాల పోటీ' కాదంటోన్న కేంద్ర మంత్రి


వచ్చే ఎన్నికల్లో పోటీ అంతా నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మధ్యే ఉంటుందని కథనాలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తనదైన శైలిలో స్పందించారు. విలేకరులనుద్ధేశించి మాట్లాడుతూ, 'పర్సనాలిటీల మధ్య పోటీ అంటున్నారు, ఎన్నికలంటే అందాల పోటీ కాదు కదా?' అని వ్యాఖ్యానించారు. ఈ రోజు గుజరాత్ లోని ఆనంద్ వద్ద గల ఇండియన్ రూరల్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ స్నాతకోత్సవంలో జైరాం రమేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'భారత్ లో ఎన్నికలంటే వ్యక్తుల మధ్య పోరాటం కాదు, పార్టీల మధ్య అందాల పోటీ అంతకన్నా కాదు' అని వ్యాఖ్యానించారు. అమెరికా మాదిరి మనకు అధ్యక్ష తరహా ఎన్నికలు ఉండవని, ఇక్కడ పార్టీలే ఎన్నికల్లో తేల్చుకుంటాయని అన్నారు. ఇక ఎన్నికలు వచ్చే మార్చి లేదా ఏప్రిల్లో ఉండవచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, యూపీల్లో వేర్వేరు పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటామని జైరాం రమేశ్ చెప్పారు.

  • Loading...

More Telugu News