: నేడు మోడీతో అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రి భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో నేడు అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రి విలియమ్ బర్న్ భేటీ కానున్నారు. వాషింగ్టన్ లో పర్యటించాలంటూ అమెరికా అధ్యక్షుడు పంపిన ఆహ్వానంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. కాగా, సెప్టెంబర్ లో అమెరికాలో పర్యటించాలని ఇప్పటికే మోడీ షెడ్యూల్ సిద్ధమైంది. భారత్-యూఎస్ మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఒబామాతో ప్రత్యేకంగా సమావేశమై ప్రధాని మాట్లాడతారు. ఇదిలావుంటే, నిన్న (గురువారం) ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలసిన విలియమ్, రెండు దేశాల దౌత్య సంబంధాలపైనే ముఖ్యంగా మాట్లాడుకున్నట్లు సమాచారం.