: అమ్మాయిలను చూసి రివాల్వర్ తీసిన హైదరాబాద్ రియల్టర్
హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో ఓ రియల్టర్ చేతిలో రివాల్వర్ మిస్ ఫైర్ అయింది. ముత్యాల రమేశ్ అనే వ్యక్తి పెళ్ళి సంబంధాల కోసం షాదీ.కామ్ ఆఫీసుకు వెళ్ళాడు. అక్కడ అమ్మాయిలను చూడగానే, హీరోయిజం ప్రదర్శించాలని భావించాడు. వెంటనే తన లైసెన్స్ డ్ రివాల్వర్ తీసి వారిముందు విలాసంగా తిప్పసాగాడు. అది కాస్తా మిస్ ఫైర్ అవడంతో బుల్లెట్ రమేశ్ తొడలోనే దూరింది. దీంతో, అతడిని హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. అతడి వద్ద రివాల్వర్, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రమేశ్ నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందినవాడని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తనకు ప్రాణహాని ఉందంటూ గత ఏడాది రివాల్వర్ లైసెన్స్ తీసుకున్నాడు.