: చంద్రబాబు పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా


చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 1999లో ప్రారంభమైన రైతు బజార్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏర్పాటు కానున్నాయి. వినియోగదారుడికి, రైతుకి ఇద్దరికీ లబ్ధి చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ప్రారంభించిన రైతు బజార్ కార్యక్రమం బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రైతు బజార్ కాన్సెప్ట్ ని... నేషనల్ మార్కెట్ అనే పేరుతో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో నెలకొల్పనుంది. రైతులు, వినియోగదారులు ఇద్దరికీ లాభదాయకంగా ఉండే నేషనల్ మార్కెట్ల ఏర్పాటుకు చురుగ్గా ప్రయత్నాలు మొదలుపెట్టామని జైట్లీ ప్రకటించారు. దళారీల బారిన పడకుండా రైతులు తమ ఉత్పత్తులను... నేషనల్ మార్కెట్ల ద్వారా మంచి రేటుకు డైరెక్ట్ గా వినియోగదారుడికి అమ్ముకోవచ్చని జైట్లీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News