: సాకులు చెబుతున్న ఇంగ్లండ్ బౌలర్లు


భారత బ్యాట్స్ మెన్ ధాటికి కుదేలైన ఇంగ్లిష్ బౌలర్లు సాకులు వెతికే పనిలో పడ్డారు. పిచ్ లో పసలేదని అంటున్నారు. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ కంటే భారత్ లోని పిచ్ లు ఎంతో నయమని ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ అన్నాడు. అక్కడి పిచ్ లే ఎంతో వేగవంతంగా ఉంటాయని పేర్కొన్నాడు. ఏ పేస్ బౌలర్ అయినా స్లిప్స్ లో గోడకట్టినట్టుండే ఫీల్డింగ్ అమరికతోపాటు ఓ గల్లీ పొజిషన్ ను కోరుకుంటాడని, కానీ, ట్రెంట్ బ్రిడ్జిలో కవర్స్ ప్రాంతంలో ముగ్గురిని పెట్టుకుని బౌలింగ్ చేయాల్సి రావడం విభిన్నంగా అనిపించిందని బ్రాడ్ తెలిపాడు. కాగా, 5 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 457 పరుగుల భారీ స్కోరు సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News