: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుపై ఉత్తరాంధ్ర ప్రజల హర్షం


విశాఖపట్నం నుంచి చెన్నైకు ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్‌ వల్ల పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇచ్చినట్లే. ఈ రెండు పోర్టు సిటీల మధ్య దాదాపు 20 క్లస్టర్లు ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. క్లస్టర్ అంటే పరిశ్రమల సమూహం. ప్రతీ క్లస్టరుకు నిరంతర విద్యుత్‌, నీరు, రోడ్డు, రైలు, వాయు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. విశాఖ-చెన్నై కారిడార్ లో దాదాపు లక్ష కోట్ల విలువైన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర నిర్ణయంపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News