: శ్రీవారి ఆలయంలో అగ్ని ప్రమాదం
తిరుమల వెంకన్న సన్నిధిలో ఈ సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి వడ ప్రసాదం తయారు చేసే పోటు వద్ద ఈ మంటలు చెలరేగడంతో ఆలయం చుట్టూ పొగలు అలుముకున్నట్టు తెలుస్తోంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని టీటీడీ అధికారులు అంటున్నారు. కాగా, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది.