: ఫలించిన టీసర్కార్ ప్రయత్నాలు... విద్యుత్ సరఫరాకు ఛత్తీస్ గఢ్ సుముఖత
తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు శుభవార్త. అదనపు విద్యుత్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 1000 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణకు సరఫరా చేసేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి నిన్న అధికారికంగా లేఖ అందింది. దీంతో, దీనికి అవసరమైన విద్యుత్ లైన్స్ వేసుకోవడంలో టీసర్కార్ నిమగ్నమైంది.