: వెంకయ్య గారూ! పోలవరంను గట్టెక్కించే బాధ్యత మీదే: టీడీపీ


ఇరు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లు నేడు లోక్ సభలో చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో, నిన్న రాత్రి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలిశారు. పోలవరం బిల్లును త్వరితగతిన ఆమోదించి, పనులు ఆరంభించేలా చూడాలని కోరారు. దీంతోపాటు, బూర్గంపాడు రెవెన్యూ మండలాన్ని కూడా బిల్లులో కలపాలని విజ్ఞప్తి చేశారు. 'పోలవరంను గట్టెక్కించే బాధ్యత మీదే' అని వెంకయ్యకు టీడీపీ ఎంపీలు విన్నవించారు.

  • Loading...

More Telugu News