: రోహిత్.. సూపర్ హిట్
పుణే వారియర్స్ తో పోరులో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లు మంచినీళ్ళ ప్రాయంలా సంధించిన ఈ యువ ఆటగాడు వేగంగా అర్థసెంచరీ సాధించాడు. నాలుగోస్థానంలో బరిలో దిగిన రోహిత్ శర్మ కేవలం 32 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. వాటిలో 5 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. ఫిఫ్టీ ముంగిట రోహిత్ వరుస సిక్స్ లతో హాఫ్ సెంచరీ అధిగమించడం విశేషం. ఇక రోహిత్ కు తోడు సచిన్ (44), దినేశ్ కార్తీక్ (41) కూడా రాణించడంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. ముంబయి జోరును అడ్డుకునేందుకు పుణే సారథి ఏంజెలో మాథ్యూస్ ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది.ఈ మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.