: అలనాటి అందాల నటి జోహ్రా సెహగల్ కాలధర్మం
అలనాటి అందాల నటి జోహ్రా సెహగల్ కాలధర్మం చెందారు. పలు హిందీ చిత్రాల్లో నటించిన సెహగల్ వయస్సు 102 సంవత్సరాలు. 1912లో ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ లో జోహ్రా సెహగల్ జన్మించారు. 1946లో చిత్రరంగ ప్రవేశం చేసిన ఆమె సినీ నటిగానే కాకుండా, హిందీ సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. జోహ్రా సెహగల్ ను భారత ప్రభుత్వం 1998లో పద్మశ్రీ, 2010లో పద్మ విభూషణ్ బిరుదులనిచ్చి గౌరవించింది. 2010లో భారత్ లోని పెద్ద వయస్కురాలిగా ఆమె రెండో స్థానంలో నిలిచారు. నీచా నగర్ (1946), ద లాంగ్ డ్యూయల్ (1967), ద గురు (1969), బాజీ ఆన్ ది బీచ్ (1992), దిల్ సే (1998) బెండ్ ఇట్ లైక్ బెక్ హామ్ (2002) తదితర చిత్రాల్లో జోహ్రా నటించింది.