: కాకతీయ, ఎంజీ వర్శిటీలకు ఇన్ ఛార్జ్ వీసీల నియామకం
తెలంగాణలోని కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలకు రాష్ట్రప్రభుత్వం ఇన్ ఛార్జ్ వీసీలను నియమించింది. కాకతీయ వర్శిటీ ఇన్ ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా వికాస్ రాజ్, మహాత్మాగాంధీ వర్శిటీ వీసీగా శైలజా రామయ్యార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శైలజా రామయ్యార్ ప్రస్తుతం కళాశాల విద్యా విభాగం కమిషనర్ గా విధులు నిర్వహిస్తుండగా, వికాస్ రాజ్ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.