: భారత్-బంగ్లా బంధానికి ఈశాన్య రాష్ట్రాల సహకారం కావాలి: బంగ్లాదేశ్ విదేశాంగ మాజీ మంత్రి


భారత-బంగ్లాదేశ్ ల మధ్య బలమైన బంధానికి, అభివృద్ధికి భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల సహకారం చాలా అవసరమని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగశాఖ మంత్రి దిపూ మోనీ అభిప్రాయపడ్డారు. ఢాకాలో బంగ్లాదేశ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో బంగ్లాదేశ్ బంధం బలపడాలంటే త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యం అవసరమని అన్నారు. బంగ్లాకు అత్యంత దగ్గరగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో భారత్ పెట్టుబడులు పెడితే ఈ రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే బంగ్లాదేశ్ ఉత్తరాది ప్రాంతాలతో పాటు, సన్నిహితంగా ఉండే దేశాల విదేశీ వ్యవహారాలపై సమావేశంలో చర్చించారు.

  • Loading...

More Telugu News