: ఎన్ డీఏ ప్రధాని అభ్యర్ధిపై మెత్తబడిన జేడీ(యూ)


ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని బీజేపీని పట్టుబట్టిన జేడీ(యూ) ఇప్పుడు మెత్తబడింది. పెట్టిన డెడ్ లైన్ ను వెనక్కి తీసుకుంది. అభ్యర్ధిని ప్రకటించడంపై బీజేపీ కొంత సమయం తీసుకుంటుందని పార్టీ జనరల్ సెక్రెటరీ కెసీ త్యాగీ తెలిపారు. అయితే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ప్రధాని అభ్యర్ధిపై చర్చిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోడీయే తమ ప్రధాని అభ్యర్ధంటున్న బీజేపీ సంకేతాలను జేడీ(యూ) బహిరంగంగానే తిరస్కరించింది. మరోవైపు, కొద్దిసేపటి ముందే జనతాదళ్ యునైటెడ్ అగ్రనేతల సమావేశం మొదలయింది. రెండురోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో బీజేపీతో పొత్తు అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు శరద్ యాదవ్, నితీశ్ కుమార్, పలవురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News