: డల్లాస్ లో ‘నాట్స్’ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు


అమెరికాలోని డల్లాస్ లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ పోటీలు ఆదివారం మధ్యాహ్నం వరకు జరుగుతాయని నాట్స్ అధ్యక్షుడు దేశు గంగాధర్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ప్రవాస భారతీయులు ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ పోటీలకు డల్లాస్ ప్రాంతంలో అనూహ్య స్పందన వస్తోందని, ఆరోసారి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని గంగాధర్ తెలిపారు.

  • Loading...

More Telugu News