: సోనియాపై ఫిర్యాదును తిరస్కరించిన అమెరికా కోర్టు
సిక్కు హక్కుల గ్రూపు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీపై దాఖలు చేసిన పిటీషన్ ను అమెరికా కోర్టు తిరస్కరించింది. అమెరికాలోని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ జేఎఫ్) అనే సంస్థ 1984 నాటి సిక్కు అల్లర్లకు సంబంధించి సోనియా గాంధీపై మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్ ను గత నెలలో విచారించిన యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బ్రియాన్ కోగెన్ సరైన ఆధారాలు లేవంటూ విచారణకు తిరస్కరించారు. దీంతో ఎస్ జేఎఫ్ ప్రతినిధులు సోనియా గాంధీపై సవరణ ఫిర్యాదు విచారించాలంటూ కోగెన్ కు లేఖ రాశారు. దీనిపై న్యాయమూర్తి కోగెన్ మాట్లాడుతూ, ఈ కేసులో సరైన ఆధారాలు లేవంటూ తుది తీర్పు వెలువడినందున దీనిని కొట్టివేస్తున్నామని స్పష్టం చేశారు.