: చంద్రబాబు నన్ను చంపాలని చూశాడు: కన్నా సంచలన ఆరోపణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఓ దశలో రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక బాబు తనను చంపేందుకు ప్రయత్నాలు చేశారని కన్నా వెల్లడించారు. అయితే అందుకు స్పష్టమైన కారణాలను ఆయన వివరించలేదు. గుంటూరులో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక ఆయన జగన్ పైనా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఓ వ్యక్తి స్వార్థం వల్ల అధికారులు, మంత్రులు రోడ్డునపడే పరిస్థితి తలెత్తిందని విచారం వ్యక్తం చేశారు.