: 10 గ్రాముల బంగారం ధర రూ.800 అప్
మోడీ సర్కారు తన తొలి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడుతుండగానే బంగారం ధర హఠాత్తుగా పెరిగిపోయింది. అందరి దృష్టి అటు బడ్జెట్ ప్రసంగం, స్టాక్ సూచీలపై ఉన్న సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.800 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ ధర 14 డాలర్లు పెరిగిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో కూడా ఆ మేర బంగారం ధరలు పెరిగాయి. అంతేకాక అమెరికాలో ఇప్పుడప్పుడే వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు లేకపోవడంతో మదుపరులంతా బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడం కూడా బంగారం ధరలు పెరగడానికి ఓ కారణంగా చెబుతున్నారు.