: ముంపు గ్రామాలను రాసిచ్చేందుకు కేంద్రం ఎవరు?: కోదండరాం
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కు రాసిచ్చేందుకు కేంద్రం ఎవరని తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షులు కోదండరాం ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరం ఆర్డినెన్స్ ను పోరాడి అడ్డుకుంటామని అన్నారు. గిరిజనుల జోలికెళ్లిన బ్రిటిషోళ్లు ఏమయ్యారో... అదే గతి కేంద్రానికి పడుతుందని ఆయన హెచ్చరించారు. కేంద్రం ఆర్డినెన్సును వెనుకకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.