: ఇక ఆర్థిక మందగమనమే: రాహుల్
మోడీ సర్కారు గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని తగ్గించేలా ఉండటంతో... దేశం ఆర్థిక మందగమన దిశగా పయనించే ప్రమాదం ఉందని రాహుల్ విమర్శించారు. అసలు ఈ బడ్జెట్ కు ఎలాంటి రోడ్ మ్యాప్ లేనేలేదని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్టీ ఎంపీలతో కలిసి అధికార పక్షంపైకి దూకేందుకు సిద్ధమైన యువరాజు ఆనక తల్లి దగ్గరే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గురువారం నాటి బడ్జెట్ పై మాత్రం కాస్త తెలివిగానే స్పందించినట్లు తెలుస్తోంది.