: మోడీ సర్కార్ బడ్జెట్ పై జయలలిత హ్యాపీ... దీదీ గుస్సా
మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వాగతించారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, దేశ ఆర్థిక రంగాన్ని సరిదిద్దాలన్న తపన మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కాగా, మోడీ సర్కార్ బడ్జెట్ పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, అరుణ్ జైట్లీ బడ్జెట్ విజన్ లెస్,మిషన్ లెస్,యాక్షన్ లెస్ బడ్జెట్ అని అభివర్ణించారు. అధికారం కట్టబెడితే వైబ్ట్రెంట్ ఇండియాను నిర్మిస్తామన్న మోడీ సర్కార్ సత్తా ఏమిటో ఈ బడ్జెట్ తో అందరికి అర్థమైందని ఆమె విమర్శించారు. భేటి బచావో....భేటి పడావో స్కీమ్ కు కేవలం రూ.100 కోట్లు ఇవ్వడాన్ని మమత తప్పు పట్టారు. బెంగాల్ లో కన్యాశ్రీ పథకానికి తాము రూ.1000 కోట్లు ఖర్చు చేస్తుండగా, మోడీ సర్కార్ దేశం మొత్తం మీద కేవలం రూ.100 కోట్లు ఖర్చు చెయ్యడాన్ని ఆమె దుయ్యబట్టారు. ఇది మహిళలను ఎగతాళి చెయ్యడమేనని ఆమె పేర్కొన్నారు. మోడీ సర్కారుకు మహిళా సంక్షేమం గురించి ఏ మాత్రం నిబద్ధత లేదని బడ్జెట్ నిరూపించిందని ఆమె మండిపడ్డారు.