: టీడీపీ తరఫున బడ్జెట్ ను స్వాగతించిన పార్టీ ఎంపీలు
ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ ను టీడీపీ తరఫున ఆ పార్టీ ఎంపీలు స్వాగతించారు. ఈ మేరకు ఢిల్లీలో మాట్లాడిన వారు, పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టిన తుప్పును ఇప్పుడు వదిలిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి రంగం దీన్ని తమ బడ్జెట్ గానే భావించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ఈసారి బడ్జెట్ లో ఆదాయ పరిమితి ఆశించిన స్థాయిలో పెంచలేదన్న ఎంపీలు... అయినా, అన్నీ ఒకేసారి చేయడం సాధ్యం కాదు కదా? అని సర్దిచెప్పుకున్నారు. కాగా, ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.