: గుడిలో తలదాచుకున్న 9 మందిని బలిగొన్న పిడుగుపాటు


వారంతా ఉపాధి హామీ పథకం కూలీలు. రోజూలాగే గురువారం కూడా ఉదయమే పనులకు వెళ్లారు. పనిచేస్తుండగానే వర్షం మొదలైంది. తేలికపాటి చినుకులతో మొదలై క్రమంగా భారీ వర్షంగా మారింది. దీంతో సమీపంలోని గుడిలోకెళ్లి తలదాచుకుందామని భావించి పరుగుపరుగున గుడిలోకి వెళ్లిపోయారు ఆ కూలీలు. అయితే ఉన్నట్లుండి గుడిపైనే పిడుగు పడింది. దీంతో గుడిలో తలదాచుకుందామని వచ్చిన వారిలో 9 మంది కూలీలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లా శ్యాంపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని అధికారులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News