: దొందూ... దొందే: జైట్లీ బడ్జెట్ పై కేజ్రీవాల్ చురకలు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ చమత్కారాలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి యూపీఏ బడ్జెట్ కు, నేటి మోడీ సర్కారు బడ్జెట్ కు లేశమాత్రం కూడా తేడా లేదన్న కేజ్రీవాల్, అప్పటి బడ్జెట్ ప్రతుల్లో చిదంబరం పేరు బదులు అరుణ్ జైట్లీ పేరు పెట్టేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. అంతేగాక రెండు ప్రభుత్వాల బడ్జెట్లూ ఏకరీతిగా సాగాయని ఆయన విమర్శించారు.