: బెనజీర్ హత్య కేసులో కోర్టుకు హాజరుకావాలని ముషారఫ్ కు ఆదేశాలు
పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను రావల్పిండి తీవ్రవాద వ్యతిరేక కోర్టు ఆదేశించింది. భుట్టో కేసులో ఈరోజు ముషారఫ్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఆయన గైర్హాజరవడంతో ఈ మేరకు కోర్టు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 23కి వాయిదావేసింది.
కాగా, ముషారఫ్ ఆస్తులను, బ్యాంకు ఖాతాలను స్థంభింపజేయాలని ప్రభుత్వ అధికారులను కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో న్యాయస్థానం గతంలో ముషారఫ్ కు రెండుసార్లు సమన్లు జారీచేసింది. 2007లో రావల్పిండిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బెనజీర్ భుట్టో పాల్గొన్నారు. ఆ సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమె మరణించారు. ఈ ఘటనలో ముషారఫ్ కేసు ఎదుర్కొంటున్నారు.