: కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ పర్యటన: వర్ల రామయ్య
తనపై నమోదైన సీబీఐ కేసులను మాఫీ చేయించుకోవాలన్న ప్రధాన లక్ష్యంతోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పర్యటనపైనే ప్రధానంగా అస్త్రాలు సంధించారు. సీబీఐ కేసులను మాఫీ చేయించండన్న అభ్యర్థనతోనే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో జగన్ భేటీ అయ్యారన్నారు. అదే సమయంలో ఈడీ దర్యాప్తు వేగాన్ని కూడా నియంత్రించాలని జగన్ కోరే అవకాశాలున్నాయని రామయ్య చెప్పారు. 2004లో సాధారణ వ్యక్తిగా ఉన్న జగన్, 2009 నాటికి లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యారో ’రాజా ఆఫ్ కరప్షన్‘ పుస్తకం సవివరంగా తెలుపుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.