: రాజీవ్ హంతకులకు మరణశిక్షను రద్దు చేయాలి: కరుణానిధి
దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన మురుగన్, శాంతన్, పెరారివలన్ లకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఒక తీర్మానం చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా, అసలు మరణశిక్షణనే రద్దు చేయాలని కూడా కరుణ డిమాండ్ చేశారు. ఖలిస్థాన్ తీవ్రవాది దేవేందర్ సింగ్ భుల్లార్ కు ఓ కేసులో విధించిన మరణ శిక్షను జీవిత శిక్షగా మార్చేదిలేదంటూ నిన్ననే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కరుణ మరణశిక్షపై గళమెత్తడం గమనార్హం.