: వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రూ.2.50 లక్షలకు పెంపు


ఈసారి ఆర్థిక బడ్జెట్ లో వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి అంతంత మాత్రమే పెరిగింది. ఈ క్రమంలో పన్ను పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇక సీనియర్ సిటిజన్ల ఆదాయ పన్ను పరిమితి రూ.3 లక్షలకు పెంచారు. పొదుపును పెంచే ఉద్దేశంలో భాగంగా సెక్షన్ 80సీ (పీపీఎఫ్) పరిమితి రూ.లక్ష నుంచి లక్షన్నరకు పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఇక గృహ రుణాల వడ్డీ పరిమితి రూ. 1.50 లక్షల నుంచి 2 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News