: కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రధానాంశాలు ఇవే (2)...


కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యాంశాలు. * ప్రణాళికా వ్యయం రూ. 17.90 లక్షల కోట్లు. * ప్రణాళికేతర వ్యయం రూ. 12.20 లక్షల కోట్లు. * ద్రవ్య లోటు 4.5 శాతం. * పౌరవిమానయానంపై ప్రత్యేక శ్రద్ధ. * ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణం (పీపీపీ పద్ధతిలో). * రక్షణ రంగానికి రూ. 2.29 లక్షల కోట్లు. * సరిహద్దుల భద్రతకు రూ. 2250 కోట్లు. * సాయుధ దళాల ఆధునికీకరణకు రూ. 5 వేల కోట్లు. * కాశ్మీర్ శరణార్థులకు రూ. 500 కోట్లు. * రూ. 100 కోట్లతో అమరజవాన్ల స్మృతి చిహ్నం. * రాష్ట్రాల్లో పోలీస్‌ వ్యవస్థ ఆధునికీరణకు రూ.3 వేల కోట్లు. * పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ. 100 కోట్లు. * పీపీఎఫ్ పరిమితి రూ. లక్ష నుంచి రూ. లక్షన్నరకు పెంపు. * గృహ రుణాల వడ్డీ పరిమితి రూ. 1.50 లక్షల నుంచి 2 లక్షలకు పెంపు. * ఐటీ పరిమితి రూ. 2 లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు పెంపు. * సీనియర్ సిటిజన్ల పన్ను మినహాయింపు రూ. 3 లక్షలకు పెంపు. * మణిపూర్ లో రూ. 100 కోట్లతో క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణం. * బెంగళూరు, ఫరీదాబాద్ లో బయోటెక్ క్లస్టర్ల అభివృద్ధి. * సెప్టెంబర్ లో మార్స్ ఆర్బిట్ ప్రయాగం. * అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ. * ఈశాన్య రాష్ట్రాల కోసం 'అరుణ ప్రభ' పేరుతో టీవీ ఛానెల్. * ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ. 53,706 కోట్లు. * ఈశాన్య రాష్ట్రాల్లో రైలు మార్గాల విస్తరణకు రూ. 500 కోట్లు. * ఉత్తరాఖండ్ లో నేషనల్ సెంటర్ ఫర్ హిమాలయన్ స్టడీస్. * గయా నగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. * ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. * కాశ్మీర్ శరణార్థుల సంక్షేమానికి రూ. 500 కోట్లు. * సున్నపు రాయి, డోలమైట్ పై పన్ను రాయితీ. * స్మార్ట్ కార్డులపై 12 శాతం ఎక్సైజ్ డ్యూటీ. * 19 ఇంచుల టీవీలు తయారు చేసే స్వదేశీ సంస్థలకు పన్ను రాయితీ. * విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదేళ్లపాటు పన్ను మినహాయింపు. * గాలి మరల విద్యుత్ కు పన్ను మినహాయింపు. * పారిశ్రామిక కారిడార్లకు సమాంతరంగా 'ఎక్స్ ప్రెస్ వే'ల నిర్మాణం. * ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై డ్యూటీ తగ్గింపు. దీంతో, టీవీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం. * బాక్సైట్ ఎగుమతి సుంకం 10 నుంచి 20 శాతానికి పెంపు. * కాకినాడలో హార్డ్ వేర్ ఉత్పత్తి కేంద్రం. * నగరాల్లో మహిళల భద్రతకు రూ. 150 కోట్లు. * కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఉత్పత్తులపై పన్ను రాయితీ. * పొగాకు ఉత్పత్తులపై 12 నుంచి 16 శాతం ఎక్సైజ్ సుంకం పెంపు. దీంతో, సిగరెట్లు చేదెక్కనున్నాయి. * గుట్కా, పాన్ మసాలాలపై 60 శాతం పన్ను పెంపు. * ఇనుము ధరలు తగ్గే అవకాశం. * ఎలక్ట్రానిక్ వస్తువులపై ఎడ్యుకేషన్ సెస్. * స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంపు. * ఫ్యాటీ ఆసిడ్స్,ఉన్ని దుస్తులు, గ్లిజరిన్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు. * పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. * వజ్రాలు, విలువైన రాళ్ల ధరలు తగ్గే అవకాశం. * బ్రాండెడ్ దుస్తులు, సబ్బులు, ప్రాసెస్డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం.

  • Loading...

More Telugu News