: కేసీఆర్ బావులను మూయించండి: మెదక్ కలెక్టర్ కు రైతు ఫిర్యాదు


మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఫాం హౌస్ లోని రెండు బావులను మూసివేయించాలని జిల్లా కలెక్టర్ కు ఓ రైతు ఫిర్యాదు చేశారు. భూగర్భ జల శాఖ, పర్యావరణ శాఖల ప్రమాణాలకు విరుద్ధంగా పేద రైతుల బావులను ఎండగట్టేలా ఉన్న ఆ బావులను తక్షణమే మూసివేయించాలని విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఒక్కో బావి రెండు ఎకరాల విస్తీర్ణంలో 70 అడుగుల లోతుతో ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మార్గదర్శకాలకు కూడా ఆ బావులు వ్యతిరేకంగా ఉన్నాయన్న సదరు రైతు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News