: ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉండాలి: టీజేఏసీ
పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉండాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ఏడు మండలాల్లోని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లోకి చేర్చాలని కూడా కేంద్రం విభజన చట్టానికి సవరణ చేసింది. అయితే పోలవరం ప్రాజెక్టు పేరిట తెలంగాణలోని ఏ ఒక్క చిన్న ముక్కను కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని తెలంగాణ వాాదులు ఆదినుంచి వాదిస్తూనే ఉన్నారు. గురువారం నాటి ధర్నాలో టీజేఏసీ కన్వీనర్ కోదండరాం పాల్గొన్నారు.