: నారా లోకేశ్ స్పీచ్ థెరపీ!


ఆంధ్రప్రదేశ్ లోని అధికారపక్షం తెలుగుదేశం ఇప్పుడు యువనేతల సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించింది. ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి వంటి నేతలు ఎన్నికల్లో ఓటమిపాలవగా, యువనేతలు తెరపైకి వచ్చారు. అయితే, సమకాలీన రాజకీయాల్లో వారికి అనుభవం తక్కువే. మీడియా ముందు ఎలా మాట్లాడాలి? కౌంటర్లు వేయడం ఎలా? ఇత్యాది అంశాలన్నీ వారికి నేర్పే బాధ్యతను నారా లోకేశ్ స్వీకరించారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ తర్ఫీదు ద్వారా వారి మైండ్ సెట్ మార్చవచ్చని లోకేశ్ భావిస్తున్నారు. ఈ శిక్షణలో సీనియర్లతోనూ గెస్ట్ లెక్చర్లు ఇప్పించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News