: ఆంధ్రప్రదేశ్ కు ఎయిమ్స్ కేటాయింపు: ఆర్థిక మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్టు లోక్ సభలో సాధారణ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీని కోసం రూ.500 కోట్ల కేటాయిస్తున్నట్టు తెలిపారు. అయితే, పశ్చిమ బెంగాల్, విదర్భ, పూర్వాంచల్లో కూడా ఎయిమ్స్ కు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దశల వారీగా అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఏపీలో ఐఐటీ ప్రతిపాదన కూడా ఉందని చెప్పారు.