: కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రధానాంశాలు ఇవే - (1)...
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారుకు ఇదే తొలి బడ్జెట్. జైట్లీ బడ్జెట్లోని ప్రధానాంశాలు ఇవే... * భారత ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. * ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం,అధిక వృద్ధి రేటును పెంచడమే ఎన్డీయే ప్రధాన లక్ష్యం. * రానున్న 3-4 ఏళ్లలో 7 నుంచి 8 శాతం వృద్ధి రేటును సాధిస్తాం. * 2008నాటి ఆర్థిక సంక్షోభం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పాటు భారత్ పై కూడా ప్రభావం చూపింది. * పేదరికాన్ని నిర్మూలిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తాం. * ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా... పరిస్థితిని సమూలంగా చక్కదిద్దుతాం. * గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న జాప్యాల వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయాం. * ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు. ఈ బడ్జెట్ ను సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రూపొందించాం. * నల్లధనం సమస్యను పరిష్కరించాల్సి ఉంది. * భవిష్యత్ తరాలకు అప్పును వారసత్వంగా ఇవ్వలేం. * జీఎస్ టీ అమలుపై ఈ ఏడాదే నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రాలతో చర్చించి జీఎస్ టీ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. * పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఏర్పాటుచేస్తాం. * ఇన్స్యూరెన్స్ రంగంలో ఎఫ్ డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంపు. * రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పెంపు. * పట్టణ నిర్మాణ రంగంలో ఎఫ్ డీఐలను అనుమతిస్తాం. * కొత్త యూరియా విధానాన్ని ప్రవేశపెడతాం. * పన్ను చెల్లింపుదారుల సమస్యల పరిష్కారం కోసం కమిషన్ ను నెలకొల్పుతాం. * దేశంలో 100 స్మార్ట్ సిటీలను నెలకొల్పుతాం. వీటి కోసం రూ. 7060 కోట్లు వెచ్చిస్తాం. * దేశంలోని 9 విమానాశ్రయాల్లో వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అమలుచేస్తాం. * గుజరాత్ లో నిర్మిస్తున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) రూ. 200 కోట్లు కేటాయిస్తున్నాం. * రక్షణ రంగానికి రూ. 2.29 లక్షల కోట్లు. * బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం. * కరెంటు ఖాతా లోటుపై నిరంతర నిఘా ఉంచుతాం. * కష్టమయినా కరెంట్ ఖాతా లోటును 4.1 శాతానికి తగ్గించారు. 2015-16 నాటికి 3.6 శాతానికి, 2016-17 నాటికి 2 శాతానికి తగ్గించాలనేదే మా లక్ష్యం. * నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. * వ్యవసాయాభివృద్ధికి 'పీఎం కృషి సచార్' పథకానికి రూ. 1000 కోట్లు. * వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పథకం. * 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ పథకం తీసుకువస్తాం. నెలకు రూ. 1000 పెన్షన్. ఈ పథకం కోసం రూ. 250 కోట్ల కేటాయింపు. * ఆహార,చమురు సబ్సిడీలపై దృష్టి సారిస్తాం. * ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ. 50,548 కోట్లు. * గ్రామీణ విద్యుదీకరణకు రూ. 500 కోట్లు. * గ్రామీణ తాగునీటికి రూ. 3,600 కోట్లు. * బాలికల సాధికారతకు రూ.100 కోట్లు. * 'ఆడపిల్లలను చదివించండి, రక్షించండి' పథకానికి రూ. 500 కోట్లు. * మహిళల భద్రతకు రూ. 150 కోట్లతో పైలట్ ప్రాజెక్టు. * అంధుల కోసం బ్రెయిలీ లిపిలో కరెన్సీ నోట్లు. * ఏపీలో ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు. ఎయిమ్స్ కోసం రూ. 500 కోట్ల కేటాయింపు. * ఆంధ్రప్రదేశ్, బెంగాల్, విదర్భ, పూర్వాంచల్ రాష్ట్రాలకు ఎయిమ్స్. అంచెలంచలుగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్. * ఆంధ్రప్రదేశ్ కు అగ్రికల్చర్ యూనివర్శిటీ. తెలంగాణకు హార్టికల్చర్ యూనివర్శిటీ. * ఏపీ, జమ్మూ,చత్తీస్ గఢ్, గోవా, కేరళ రాష్ట్రాలకు ఐఐటీలు. దేశంలో 4 ఐఐఎంలు. * కొత్తగా 12 మెడికల్ కాలేజీలు (వైద్య,దంత). * ప్రధాని గ్రామ్ సడక్ యోజనకు రూ. 14,389 కోట్లు. * 2019 నాటికి పరిశుభ్ర భారత్. * గ్రామీణ గృహ నిర్మాణానికి రూ. 8000 కోట్లు. * నైపుణ్యాల పెంపునకు స్కిల్ ఇండియా కార్యక్రమం. * 2022 నాటికి అందరికీ నివాసం. * దళిత, గిరిజన, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు. * ఏకీకృత ప్రావిడెంట్ ఫండ్ విధానం కోసం ఈపీఎఫ్ వో ప్రారంభం. * సర్వశిక్షా అభయాన్ కు రూ. 28,635 కోట్లు. * మదర్సాల అభివృద్ధికి రూ. 100 కోట్లు. * వాటర్ షెడ్ పథకానికి రూ. 2142 కోట్లు. * గుజరాత్ తరహా పట్టణికీకరణకు చర్యలు. * ప్రభుత్వ రంగ సంస్థల్లో మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి రూ. 2.4 లక్షల కోట్లు. * ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు. జాతీయ బ్యాంకుల్లో వాటాల అమ్మకం ద్వారా మూలధనం పెంపు. అయితే, అధిక వాటాను ప్రభుత్వం కలిగి ఉంటుంది. * గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ. 14,389 కోట్లు. * నగరాల్లో మెట్రో పనులకు రూ. 100 కోట్లు. * కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అభివృద్ధికి రూ. 100 కోట్లు. * ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు రూ. 500 కోట్లు. * మహిళలకు పావలా వడ్డీ పథకం 250 జిల్లాలకు పెంపు * పట్టణాల్లో రైతు మార్కెట్లు. * రైతుల కోసం కిసాన్ టెలివిజన్ కు రూ. 100 కోట్లు. * వ్యవసాయ రంగంలో గోదాముల నిర్మాణానికి రూ. 5000 వేల కోట్లు. * వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధికి రూ. 500 కోట్లు. * రైతులకు 3 శాతం వడ్డీతో పంట రుణాలు. * నాబార్డు ద్వారా 5 లక్షల మంది భూమి లేని రైతులకు ఆర్థిక సాయం. * దేశవ్యాప్తంగా 100 మొబైల్ భూసార పరీక్షా కేంద్రాలు. * భూసార పరీక్షా కేంద్రాలకు రూ. 56 కోట్లు. * రైతుల భూ నాణ్యత కార్డులకు రూ. 100 కోట్లు. * సకాలంలో వడ్డీ చెల్లించిన రైతులకు రాయితీ కొనసాగింపు. * పథకాల్లో తాగునీటి పథకానికి రూ. 28635 కోట్లు. * నేషనల్ హౌసింగ్ బ్యాంక్ * వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ కారిడార్ లో తొలుత 20 పరిశ్రమలు. * ఆర్థిక వ్యవస్థ పటిష్ఠానికి కాకినాడ పోర్టు కీలకం. * స్టార్టప్ కంపెనీల కోసం రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక నిధి. * ఈ ఏడాది 16 కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి. * 6 టెక్స్ టైల్ పార్క్ ల ఏర్పాటు కోసం రూ. 200 కోట్లు. (తెలుగు రాష్ట్రాలకు టెక్స్ టైల్ పార్క్ దక్కలేదు) * ముంబై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ సకాలంలో పూర్తి. * జమ్మూ కాశ్మీర్ హస్తకళల ప్రోత్సాహానికి రూ. 50 కోట్లు. * బెనారస్ సిల్స్ అభివృద్ధికి రూ. 50 కోట్లు. * జాతీయ రహదారుల విస్తరణకు రూ.37857 కోట్లు. * కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటి. * రూ.11600 కోట్లతో నౌకాశ్రయాల అనుసంధానం * అలహాబాద్ నుంచి హల్దియా వరకు జల రవాణా మార్గానికి రూ. 4200 కోట్లు. దీంతో 1500 టన్నుల సామర్థ్యం గల వాణిజ్య నౌకలకు వెసులుబాటు. * గ్యాస్ గ్రిడ్ పూర్తి చేసేందుకు (పీపీపీ విధానంలో) 15 వేల కి.మీ. అదనపు పైప్ లైన్ నిర్మాణం. * అన్ని లావాదేవాలకు ఒకటే డీమ్యాట్ ఖాతా. * ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో విమానాశ్రయాల అభివృద్ధి. * మైనింగ్ చట్టానికి సవరణలు తెస్తాం. * హైదరాబాదులో డెడ్ రికవరీ ట్రైబ్యునల్. * తమిళనాడు, రాజస్థాన్ లో సోలార్ విద్యుత్ కు రూ. 500 కోట్లు. * నదుల అనుసంధానంపై అధ్యయనానికి రూ. 100 కోట్లు. * నమో గంగా పథకానికి రూ. 2037 కోట్లు. * మెరైన్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 115 కోట్లు.