: చావడానికైనా సిద్ధమే.. అరెస్టులు ఓ లెక్కా?: టీవీ నటులు


అరెస్టులు చేసి తమ ఉద్యమాన్ని అణచలేరని తెలుగు బుల్లితెర నటులు అంటున్నారు. డబ్బింగ్ సీరియళ్ళను అడ్డుకునేందుకు చావడానికైనా సిద్ధపడి ఆమరణ దీక్ష చేస్తున్నామని, ఈ అరెస్టులు తమను ఏమీ చేయలేవని తెలుగు టీవీ పరిరక్షణ సమితి సభ్యులు పేర్కొన్నారు. అనువాద ధారావాహికలు ప్రసారం చేస్తోందని నిన్న మాటీవీ కార్యాలయంపై పలువురు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. నేడు సారథీ స్టూడియోపైనా దాడి జరగడంతో పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. అదే క్రమంలో మాటీవీపై దాడి ఘటనలోనూ ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీవీ నటులు స్పందించారు.

  • Loading...

More Telugu News